అగ్రస్థానంలో జీవితేశ్‌ | jeevitesh leads in all india chess tourney | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో జీవితేశ్‌

Aug 6 2017 10:47 AM | Updated on Sep 17 2017 5:14 PM

అగ్రస్థానంలో జీవితేశ్‌

అగ్రస్థానంలో జీవితేశ్‌

‘నిథమ్‌’ ఆలిండియా ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌ తర్వాత టాప్‌ సీడ్‌ ఫిడే మాస్టర్‌ అగ్ని జీవితేశ్‌ ...

సాక్షి, హైదరాబాద్‌: ‘నిథమ్‌’ ఆలిండియా ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌ తర్వాత టాప్‌ సీడ్‌ ఫిడే మాస్టర్‌ అగ్ని జీవితేశ్‌ ... ప్రదీప్, చక్రవర్తి రెడ్డి, శ్రీశ్వాన్, సౌరభ్, మైత్రేయన్, బాలకిషన్, లోకేశ్, విక్రమ్‌జీత్‌ సింగ్, శ్రీనివాస రావు, కనిష్క్, వైభవ్, బాలకన్నమ్మలతో కలసి నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా తొలి స్థానంలో ఉన్నాడు. నిథమ్‌ క్యాంపస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్‌లో సాయి అగ్ని జీవితేశ్‌ (తెలంగాణ, 4) దివ్యాలక్ష్మి (తమిళనాడు, 3)పై విజయం సాధించాడు. ఇతర గేముల్లో ప్రదీప్‌ (తమిళనాడు, 4) విశ్వనాథ్‌ ప్రసాద్‌ (తెలంగాణ, 3)పై, చక్రవర్తి రెడ్డి (తెలంగాణ, 4) అంకన్‌ (బెంగాల్, 3)పై, శ్రీశ్వాన్‌ (తెలంగాణ, 4) వరుణ్‌ (తెలంగాణ, 3)పై గెలుపొందారు. శరణ్య (తమిళనాడు, 3.5), శేఖర్‌ (తమిళనాడు, 3.5)ల మధ్య జరిగిన గేమ్‌ డ్రాగా ముగిసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement