ఇషాంత్ శర్మ @ 200 | ishanth sharma takes 200nd wicket in test cricket | Sakshi
Sakshi News home page

ఇషాంత్ శర్మ @ 200

Sep 1 2015 3:42 PM | Updated on Sep 3 2017 8:33 AM

ఇషాంత్ శర్మ @ 200

ఇషాంత్ శర్మ @ 200

భారత పేసర్ ఇషాంత్ శర్మ మరో మైలురాయిని అధిగమించాడు. టెస్టు క్రికెట్లో ఇషాంత్ 200 వికెట్ల క్లబ్లో చేరాడు.

భారత పేసర్ ఇషాంత్ శర్మ మరో మైలురాయిని అధిగమించాడు. టెస్టు క్రికెట్లో ఇషాంత్ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. శ్రీలంకతో మూడో మ్యాచ్లో ఈ ఢిల్లీ బౌలర్.. సెంచరీ హీరో మాథ్యూస్ను అవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇవ్వడంతో పాటు తన ఖాతాలో 200వ వికెట్ను జమ చేశాడు. ఇషాంత్కిది 65వ టెస్టు మ్యాచ్.

శ్రీలంకతో కీలక మూడో టెస్టులో ఇషాంత్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో ఇషాంత్ 5 వికెట్లు పడగొట్టి టీమిండియా ఆధిక్యానికి సాయపడ్డాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. లంక పర్యటనలో స్పిన్నర్ల హవా సాగిన తొలి రెండు టెస్టు మ్యాచ్ల్లో అతను అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి టెస్టులో 2, రెండో మ్యాచ్లో 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే మూడో టెస్టులో ఇషాంత్ సూపర్ స్పెల్తో జట్టును ఆదుకున్నాడు. ఇక తన కెరీర్లో 76 వన్డేలాడిన ఇషాంత్ 106 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement