అఫ్గాన్‌ టెస్ట్‌కు ఇషాంత్‌ డౌటే.! | Ishant Sharma Likely to Miss Afganisthan Test | Sakshi
Sakshi News home page

Jun 4 2018 8:53 PM | Updated on Mar 28 2019 6:10 PM

Ishant Sharma Likely to Miss Afganisthan Test - Sakshi

ఇషాంత్‌ శర్మ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : అఫ్గానిస్తాన్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు టీమిండియాను గాయల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా బొటన వేలి గాయంతో దూరం కాగా అతని స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేశారు. తాజాగా పేసర్‌ ఇషాంత్‌ శర్మ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇషాంత్‌ ఇంగ్లండ్‌లో సస్సెక్స్‌ జట్టు తరుపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఇషాంత్‌ గాయపడ్డాడని వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతోంది.

ఆ ట్వీట్‌లో ఇషాంత్‌ గాయపడ్డాడని, అతని స్థానంలో వేరే ఆటగాడిని తీసుకున్నట్లు ఆ జట్టు పేర్కొంది. అయితే అది చిన్న గాయమా, పెద్దదా అని తెలియాల్సి ఉంది. దీంతో అఫ్గాన్‌తో బెంగళూరు వేదికగా జూన్‌ 14న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు ఇషాంత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది జరిగితే భారత్‌కు కష్టాలు తప్పవు. మరోవైపు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఫామ్‌ భారత్‌ను కలవరపెడుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లతో చెలరేగిన రషీద్‌ తమ జట్టుకు విజయాన్నందించాడు. ఇషాంత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో భాగంగా 6 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో సైతం 8 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement