స్క్వాష్ ఫైనల్స్లోకి దీపిక జోడీ | Indian women's team in Asiad squash final | Sakshi
Sakshi News home page

స్క్వాష్ ఫైనల్స్లోకి దీపిక జోడీ

Sep 26 2014 1:52 PM | Updated on Sep 2 2017 2:00 PM

స్క్వాష్ ఫైనల్స్లోకి దీపిక జోడీ

స్క్వాష్ ఫైనల్స్లోకి దీపిక జోడీ

ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో రజతం లేదా స్వర్ణం రావడం ఖాయమైపోయింది.

ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో రజతం లేదా స్వర్ణం రావడం ఖాయమైపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రతిభతో స్వర్ణపతకం సాధించిన భారత అమ్మాయిల జోడీ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లోనూ ఫైనల్స్లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్స్లో దక్షిణ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి వాళ్లీ ఘనత సాధించారు.

ఇప్పుడు ఫైనల్స్లో మలేసియా జట్టుతో పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్లో కూడా నెగ్గితే ఇక స్వర్ణపతకం వచ్చేసినట్లే. ప్రపంచ నెంబర్ 21 ర్యాంకర్ అయిన జోష్న యూనక్ పార్క్ను కేవలం 34 నిమిషాల్లోనే 3-0 తేడాతో ఓడించింది. మరోవైపు ప్రపంచ 12వ ర్యాంకర్ అయిన దీపిక సున్మీ సాంగ్పై 37 నిమిషాల్లో 3-1 తేడాతో గెలిచింది. మరో సెమీ ఫైనల్లో మలేసియా జట్టు హాంగ్కాంగ్ జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement