ముగిసిన సత్యన్‌ పోరు  | Indian 1 one Satyan Gnanasekaran at the Austrian Table Tennis Tournament | Sakshi
Sakshi News home page

ముగిసిన సత్యన్‌ పోరు 

Nov 10 2018 3:10 AM | Updated on Nov 10 2018 3:17 AM

Indian 1 one Satyan Gnanasekaran at the Austrian  Table Tennis Tournament - Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రియా ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ పోరాటం ముగిసింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ జు జిన్‌ (చైనా)తో శుక్రవారం లింజ్‌ నగరంలో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్‌ సత్యన్‌ 1–11, 7–11, 11–7, 2–11, 4–11తో ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో సత్యన్‌ 4–11, 11–9, 11–9, 8–11, 6–11, 11–9, 11–7తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ మార్కోస్‌ ఫ్రెటాస్‌ (పోర్చుగల్‌)పై సంచలన విజయం సాధించాడు.   

Advertisement
 
Advertisement
Advertisement