భారత్ పరాజయం | India women's hockey team prepared for Champions Challenge 1 | Sakshi
Sakshi News home page

భారత్ పరాజయం

Apr 28 2014 1:43 AM | Updated on Sep 2 2017 6:36 AM

చాంపియన్స్ చాలెంజ్-1 మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. ఆట 12వ నిమిషంలో వందన గోల్ తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత తడబడింది.

గ్లాస్గో (స్కాట్లాండ్): చాంపియన్స్ చాలెంజ్-1 మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. ఆట 12వ నిమిషంలో వందన గోల్ తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత తడబడింది.
 
 ఒక్కసారిగా కొరియా దూకుడు పెంచి 14, 24, 28వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసింది. 42వ నిమిషంలో కొరియా మరో గోల్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 69వ నిమిషంలో పూనమ్ రాణి భారత్ ఖాతాలో రెండో గోల్‌ను జమచేసినా ఫలితం లేకపోయింది. సోమవారం జరిగే రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో భారత్ తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement