బెలారస్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది.
భోపాల్: బెలారస్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 2–1తో గెలిచింది. భారత్ తరఫున రాణి రాంపాల్ (9వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... బెలారస్ జట్టుకు స్వియాత్లానా బహుషివిచ్ ఏకైక గోల్ అందించింది.