భారత్‌ బదులు తీర్చుకునేనా!   | Hockey series with Germany from today | Sakshi
Sakshi News home page

భారత్‌ బదులు తీర్చుకునేనా!  

Oct 23 2024 3:35 AM | Updated on Oct 23 2024 3:35 AM

Hockey series with Germany from today

నేటి నుంచి జర్మనీతో హాకీ సిరీస్‌

మధ్యాహ్నం గం. 3:00 నుంచి దూరదర్శన్‌ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో జర్మనీ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం భారత పురుషుల హాకీ జట్టుకు లభించింది. ప్రపంచ చాంపియన్‌ జర్మనీ జట్టుతో నేడు, రేపు జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పదేళ్ల తర్వాత స్థానిక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండటం విశేషం. 

చివరిసారి 2014లో వరల్డ్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ధ్యాన్‌చంద్‌ స్టేడియం వేదికగా నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో భారత జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోయి ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీ జట్టు రెండో స్థానంలో, భారత జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. 

ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. కెపె్టన్, డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రాణిస్తే భారత జట్టు పైచేయి సాధించే అవకాశముంది. భారత్, జర్మనీ జట్లు ముఖాముఖిగా ఇప్పటి వరకు 107 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 54 మ్యాచ్‌ల్లో జర్మనీ జట్టు గెలుపొందగా... 26 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు విజయం దక్కింది. మరో 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.   

Advertisement
 
Advertisement
Advertisement