హాకీలో భారత్కు తొమ్మిదో స్థానం | India beat South Korea, finish ninth in hockey World Cup | Sakshi
Sakshi News home page

హాకీలో భారత్కు తొమ్మిదో స్థానం

Jun 14 2014 2:25 PM | Updated on Sep 2 2017 8:48 AM

హాకీ ప్రపంచ కప్లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచ కప్లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొమ్మిది-పది స్థానాల కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 3-0తో ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాపై  విజయం సాధించింది. భారత ఆటగాడు ఆకాష్దీప్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆరో నిమిషంలోనే ఆకాష్దీప్ గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. విరామం తర్వాత భారత్ ఇదే జోరు కొనసాగించింది. 42వ నిమిషంలో రూపేందర్ పాల్ సింగ్, 50వ నిమిషంలో ఆకాష్దీప్ మరో గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్లో దక్షిణ కొరియా బోణీ కూడా కొట్టలేకపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement