
2016 ప్రపంచ కప్‌కు భారత మహిళలు క్వాలిఫై
మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఐదోస్థానం దక్కింది. సెమీస్ చేరడంలో విఫలమైన మిథాలీ సేన బుధవారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాక్‌పై గెలుపు
సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఐదోస్థానం దక్కింది. సెమీస్ చేరడంలో విఫలమైన మిథాలీ సేన బుధవారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వచ్చే టి20 ప్రపంచకప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (43 బంతుల్లో 39; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, స్మృతి మందన (22 బంతుల్లో 22; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మహిళలు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేయగలిగారు.
నాహిదా ఖాన్ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు), నిదా దార్ (13 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడినా తమ జట్టును గెలిపించలేకపోయారు. సోనియా దబీర్ (3/14) మూడు వికెట్లతో పాక్ టాప్ ఆర్డర్‌ను కూల్చగా, పూనమ్ యాదవ్ (2/25), స్రవంతి నాయుడు (2/12)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి న్యూజిలాండ్ కూడా 2016 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయింది.