కృనాల్‌ ఔట్‌.. మనీశ్‌ ఇన్‌

IND VS BAN 3rd T20: Manish In For Krunal  - Sakshi

నాగ్‌పూర్‌: భారత్, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతను తేల్చే పోరుకు రంగం సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల పోరులో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా, ఆదివారం విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లలో ఒక్కో మార్పు చోటుచేసుకున్నాయి.  

తొలి రెండు టీ20ల్లో అంతగా ప్రభావం చూపని ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాపై వేటు పడింది. అతడి స్థానంలో బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక బంగ్లా జట్టు నుంచి ఆఫ్‌ స్పిన్నర్‌ మొసద్దిక్‌ హుస్సేన్‌ను తప్పించి మిథున్‌ను తీసుకున్నారు. గత మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి చూస్తే టీమిండియా ప్రత్యర్థికంటే బలంగా కనిపిస్తుండగా, తప్పులు సరిదిద్దుకొని మరో అద్భుత విజయం సాధించాలనే లక్ష్యం బంగ్లా జట్టులో కనిపిస్తోంది.

కాగా ఈ మ్యాచ్‌ సిరీస్‌ను విన్నర్‌గా డిసైడ్‌ చేసేదే కాదు.. యువ క్రికెటర్లకు చివరి సువర్ణావకాశం. ముఖ్యంగా రిషభ్‌ పంత్‌, ఖలీల్‌ అహ్మద్‌లు తర్వాతి సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. ఇక నాగ్‌పూర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ గ్రౌండ్‌ పెద్దగా ఉండటంతో భారీ స్కోర్‌ నమోదవడం కష్టం. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.  

తుది జట్లు
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, మనీశ్‌, సుందర్, చహల్, చహర్, ఖలీల్‌ అహ్మద్‌. 
బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెప్టెన్‌), సర్కార్, దాస్, నయీమ్, ముష్ఫికర్, అఫీఫ్, మిథున్‌, అమీనుల్, ముస్తఫిజుర్, అల్‌ అమీన్, తైజుల్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top