జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీకి చెందిన సీనియర్, జూనియర్ సెలక్టర్లు తమ వేతనాలను పెంచాల్సిందిగా బీసీసీఐని కోరారు.
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీకి చెందిన సీనియర్, జూనియర్ సెలక్టర్లు తమ వేతనాలను పెంచాల్సిందిగా బీసీసీఐని కోరారు. దేశవాళీ క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారుల వేతనాలను పెంచే ప్రయత్నంలో ఉన్నామని ఇటీవల బోర్డు పేర్కొంది.
దీంతో సెలక్టర్లు తమ గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు సీజన్‌కు రూ.60 లక్షలు పొందుతున్నారు. అదే జూనియర్ ప్యానెల్ సభ్యులు ఏడాదికి రూ.40 లక్షల వేతనం తీసుకుంటున్నారు.