తొలి రౌండ్‌లోనే జోష్నా పరాజయం | In first round joshna lose match | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే జోష్నా పరాజయం

Mar 19 2014 1:25 AM | Updated on Sep 2 2017 4:52 AM

తొలి రౌండ్‌లోనే జోష్నా పరాజయం

తొలి రౌండ్‌లోనే జోష్నా పరాజయం

ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

 పెనాంగ్ (మలేసియా): ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ 19వ ర్యాంకర్ జోష్నా 7-11, 7-11, 11-9, 2-11తో నాలుగో ర్యాంకర్ అలిసన్ వాటర్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది గత నెల్లో డబ్ల్యుఎస్‌ఏ టూర్ ఈవెంట్‌లో విజేతగా నిలిచి జోరుమీదున్నట్లు కనిపించిన జోష్నా తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం అభిమానులను నిరాశపరిచింది.
 
  ప్రపంచ 11వ ర్యాంకర్, భారత స్టార్ దీపికా పల్లికల్ బుధవారం తన తొలి మ్యాచ్‌లో క్వాలిఫయర్ లీసా ఐట్కెన్ (ఇంగ్లండ్)తో తలపడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement