అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్ | I'm in the best phase: Kashyap | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్

Aug 9 2015 12:44 AM | Updated on Sep 3 2017 7:03 AM

అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్

అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్

తన కెరీర్‌లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని... ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి పతకంతో తిరిగి వస్తానని భారత

న్యూఢిల్లీ : తన కెరీర్‌లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని... ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి పతకంతో తిరిగి వస్తానని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నెల రోజులపాటు తీవ్రంగా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఈసారి వస్తుందని భావిస్తున్నాను. నా ఆటతీరుతో కోచ్ గోపీచంద్ సంతృప్తిగా ఉన్నారు. నా కెరీర్‌లోనే ఇపుడు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాను’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. 

‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి మెగా ఈవెంట్‌లో అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారు. మూడో రౌండ్‌లో నాకు కెంటో మొమోటా ఎదురయ్యే అవకాశముంది. సింగపూర్, ఇండోనేసియా ఓపెన్ టైటిల్స్ సాధించిన అతను ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. నావరకైతే కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది’ అని కశ్యప్ అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement