సరైన సమయంలో చెబుతాం | ICC talks about staging T20 World Cup amidst COVID-19 crisis | Sakshi
Sakshi News home page

సరైన సమయంలో చెబుతాం

Apr 18 2020 5:07 AM | Updated on Apr 18 2020 5:07 AM

ICC talks about staging T20 World Cup amidst COVID-19 crisis - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే పొట్టి ప్రపంచకప్‌పై తొందరపడాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వ్యాఖ్యానించింది. కోవిడ్‌–19 రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన ఈవెంట్‌పై ఇప్పుడే నిర్ణయానికి రాలేమని... దీనికి చాలా సమయముందని,  కాబట్టి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ‘ఐసీసీ ఈవెంట్ల కోసం మా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం కూడా బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ఆలోచించాల్సిన అవసరముంది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement