హైదరాబాద్‌కు టైటిల్ | hyderabad wins mens handball title | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు టైటిల్

Nov 4 2016 11:05 AM | Updated on Sep 4 2018 5:24 PM

అంతర్ జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. సరూర్‌నగర్‌లోని డీఎస్‌ఏ గ్రౌండ్‌‌సలో గురువారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 14-10తో నిజామాబాద్ జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది.

 

మూడో స్థానం కోసం జరిగిన పోరులో వరంగల్ జట్టు 10-9తో కరీంనగర్‌పై ఆధిక్యం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ డిప్యూటీ డెరైక్టర్ చంద్రారెడ్డి, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement