హైదరాబాద్ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్‌లో పాల్గొనే అండర్-14 క్రికెట్ జట్టు వివరాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది.
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్‌లో పాల్గొనే అండర్-14 క్రికెట్ జట్టు వివరాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. జట్టు కెప్టెన్‌గా సమిత్ రెడ్డి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ వచ్చే నెల 6 నుంచి గోవాలో జరగనుంది. జట్టు కోచ్‌గా చేతన్ ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జింఖానా మైదానంలో హాజరు కావాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
జట్టు: సూర్య తేజ, ప్రత్యూష్, వరుణ్ గౌడ్, రేవంత్, నిహాంత్ రెడ్డి, ప్రగ్యున్ దూబే, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, అజయ్‌దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, అలంక్రిత్ అగర్వాల్, అంకిత్ రెడ్డి, కమల్ కుమార్, రిషబ్, సాయిపూర్ణా రావు, మన్నాస్.