హైదరాబాద్ జట్టుకు టైటిల్ | hyderabad hand ball team gets inter district senior trophy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్టుకు టైటిల్

Sep 27 2016 12:20 PM | Updated on Sep 4 2018 5:24 PM

అంతర్ జిల్లా సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ట్రోఫీని హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది.

అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ టోర్నీ


సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ట్రోఫీని హైదరాబాద్ జట్టు  కైవసం చేసుకుంది. వరంగల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ జట్టు 16-9తో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున దుర్గ 5, రాణి, 5, రమ్యకృష్ణ 5 గోల్స్‌తో రాణించారు.

 

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు 10-1తో వరంగల్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ దుర్గ 3, రమ్యకృష్ణ 4, రాణి 3 గోల్స్‌తో ఆకట్టకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌డీహెచ్‌ఏ) అధ్యక్షుడు బి. విజయ్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రఫీఖ్ పాషా, కార్యదర్శి సీహెచ్. ఫ్రాంక్లిన్, సంయుక్త కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement