హైదరాబాద్‌కు మూడోస్థానం | hyderabad gets third place in soft ball tourny | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మూడోస్థానం

Dec 13 2016 11:10 AM | Updated on Oct 22 2018 8:11 PM

సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది.

సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని నరేంద్ర హైస్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో మెదక్ జట్టు 7-5తో నిజామాబాద్‌పై గెలిచి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు 3-2తో మెదక్ జట్టును ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం దక్కింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం ప్రతినిధులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement