హ్యూస్ అంత్యక్రియలకు'లైవ్' ఏర్పాట్లు! | Hughes' funeral to be live screened at SCG | Sakshi
Sakshi News home page

హ్యూస్ అంత్యక్రియలకు'లైవ్' ఏర్పాట్లు!

Dec 1 2014 12:19 PM | Updated on Sep 2 2017 5:28 PM

గత నాలుగురోజుల క్రితం క్రికెట్ లో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ అంత్యక్రియలను లైవ్ లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

సిడ్నీ:గత నాలుగురోజుల క్రితం క్రికెట్ లో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ అంత్యక్రియలను లైవ్ లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  డిసెంబర్ 3 (బుధవారం)న హ్యూస్ అంత్యక్రియలు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్‌లోని తమ సొంతూరు మాక్స్‌విలేలో నిర్వహించేందుకు ఏర్పాట్లు  పూర్తయ్యాయి. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్‌కు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేసేందుకు ఎస్జీజీ (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్) లో స్రీన్ ను ఏర్పాటు చేసినట్లు సీఏ తెలిపింది.

 

హ్యూస్ అంతిమ సంస్కార కార్యక్రమాన్ని ఛానల్ 9 లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని పేర్కొంది. ఇప్పటికే  హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్‌లో 63 రిటైర్డ్‌హర్ట్ అని కాకుండా 63 నాటౌట్‌గా స్కోర్ కార్డ్‌ను మారుస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement