చెస్‌ చాంప్స్‌ హిమేశ్, ఆదిత్య

Himesh and Aditya won Chess titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఇ. హిమేశ్, జి. ఆదిత్య వరుణ్‌ విజేతలుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్‌ విభాగంలో కేంద్రీయ విద్యాలయకు చెందిన హిమేశ్‌ నిర్ణీత ఆరు రౌండ్లలో 6 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నికుంజ్, సి. హేమ సాయి వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో  5.5 పాయింట్లు సాధించిన ఆదిత్య విజేతగా నిలవగా, సృజన్‌ కీర్తన్, కె. తరుణ్‌ తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.   

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు

అండర్‌–14 బాలురు: 1. చైతన్య కుమార్, 2. భరత్‌ కుమార్‌; బాలికలు: 1. ఎ. శ్రీద, 2. ఎస్‌. స్థాపిక. n అండర్‌–12 బాలురు: 1. నికుంజ్, 2. సి. హేమసాయి; బాలికలు: 1. భిల్వ నిలయ, 2. మౌనిక.  n  అండర్‌–10 బాలురు: 1. పి. తనుశ్, 2. సీహెచ్‌. అనిరుధ్‌; బాలికలు: 1. జి. ఈశ్వాని, 2. ఎం. వేద శ్రుతి.  n అండర్‌–8 బాలురు: 1. విఘ్నేశ్‌ అద్వైత్, 2. నందసాయి వినీశ్‌; బాలికలు: 1. ఆర్‌. సమీర, 2. తనుశ్రీ. n అండర్‌–6 బాలురు: 1. పవన్‌ కార్తికేయ, 2. డి. పార్థివ్‌.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top