వార్నీ.. కేఎల్‌ రాహుల్‌ అవార్డు.. పాండ్యా చేతికి!

Hardik Pandya Collects KL Rahul IPL Award - Sakshi

హైదరాబాద్‌: హార్దిక్‌ పాం‍డ్యా, కేఎల్‌ రాహుల్‌ మధ్య ఉన్న దోస్తీ గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’  షోలో పాల్గొని.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకొంది. కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా వేటు కూడా వేసింది. ఈ వివాదం తర్వాత వీరు కలిసి పెద్దగా కనిపించలేదు. కానీ ఆదివారం ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఐపీఎల్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌కు ఐపీఎల్‌ మోస్ట్‌ స్టైలిష్‌ ప్లేయర్‌ అవార్డు ప్రకటించారు. కేఎల్‌ రాహుల్‌ అక్కడ లేకపోవడంతో అతని తరఫున హార్దిక్‌ పాండ్యా అవార్డు అందుకున్నారు. ఇలా అవార్డు అందుకోవడంపై సోషల్‌ మీడియాలో సెటైర్లతోపాటు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండదని, ఐపీఎల్‌ ఫైనల్‌ హైలెట్‌ అంటే.. అది కేఎల్‌ రాహుల్‌ అవార్డును పాండ్యా తీసుకోవడమేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. బెస్ట్‌ ఫ్రెండ్‌షిఫ్‌ అంటే ఇలా ఉండాలని, వివాదాలు ఎన్ని వచ్చినా ఇలాంటి మ్యాజిక్‌ మూమెంట్స్‌తో కలిసి సాగాలని, అదే నిజమైన స్నేహమని మరికొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top