రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా హర్భజన్ | Harbhajan Singh to lead Rest of India in Irani Cup; Sehwag left out | Sakshi
Sakshi News home page

రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా హర్భజన్

Feb 4 2014 12:46 AM | Updated on Sep 2 2017 3:18 AM

రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా హర్భజన్

రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా హర్భజన్

ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టుకు స్నిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు.

న్యూఢిల్లీ: ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టుకు స్నిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన ఓపెనర్ గౌతమ్ గంభీర్ 15 మంది జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈనెల 9 నుంచి బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది.
 
 భజ్జీని కెప్టెన్‌గా చేయడంతో పాటు గంభీర్‌ను ఆడిస్తుండడంతో టెస్టు ఫార్మాట్‌లో వీరిద్దరిని సెలక్టర్లు ఇంకా పరిగణనలోకి తీసుకుంటున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీ టాప్ స్కోరర్ కేదార్ జాదవ్, బాబా అపరాజిత్, అంకిత్ బావ్నే కూడా జట్టులో ఉన్నారు.
 
 రెస్టాఫ్ ఇండియా జట్టు: హర్భజన్ (కెప్టెన్), జీవన్‌జ్యోత్ సింగ్, గంభీర్, అపరాజిత్, కేదార్ జాదవ్, బావ్నే, దినేశ్ కార్తీక్, మిశ్రా, పంకజ్, దిండా, ఆరోన్, రసూల్, అనురీత్ సింగ్, బెహరా, మన్‌దీప్ సింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement