సెలక్టర్‌గా దీప్‌దాస్ గుప్తా! | Gupta dipdas as a selector! | Sakshi
Sakshi News home page

సెలక్టర్‌గా దీప్‌దాస్ గుప్తా!

Aug 7 2015 12:39 AM | Updated on Sep 3 2017 6:55 AM

భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా భార త జట్టు సెలక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

న్యూఢిల్లీ : భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా  భారత జట్టు సెలక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్‌జోన్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సాబా కరీం పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. అతడి స్థానంలో ఈసారి ఈస్ట్ జోన్ తరఫున సెలక్టర్ అభ్యర్థిని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో రేసులో దీప్‌దాస్ గుప్తా గట్టి అభ్యర్థిగా ఉండగా... మరోవైపు బెంగాల్ మాజీ కెప్టెన్ దేవాంగ్ గాంధీ పేరు కూడా పరిశీలనలో ఉంది. దాల్మియా, గంగూలీ కలిసి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement