స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి | Give respect to spinners early on, says former India captain Rahul Dravid | Sakshi
Sakshi News home page

స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి

Aug 17 2015 6:03 PM | Updated on Sep 3 2017 7:37 AM

స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి

స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి

స్పిన్ బౌలింగ్ను సహనంతో ఎదుర్కోవాలని, ఆరంభం నుంచే దూకుడు పనికిరాదని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు.

స్పిన్ బౌలింగ్ను సహనంతో ఎదుర్కోవాలని, ఆరంభం నుంచే బ్యాట్స్మెన్ దూకుడు పాటించడం పనికిరాదని టీమిండియా మాజీ కెప్టెన్, భారత్-ఎ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. స్పిన్ను ఎదుర్కొనేందుకు సరైన ఫుట్వర్క్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డాడు. స్పిన్ బంతులు ఆడటంలో ఒక్కో బ్యాట్స్మన్ది ఒక్కో శైలి అని ద్రావిడ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

టీమిండియా బలాల్లో స్పిన్ బౌలింగ్ ఒకటని ద్రావిడ్ అన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో నాణ్యమైన స్పిన్నర్ల కొరత ఉందని చెప్పాడు. టాప్-4 స్పిన్నర్లు రాణిస్తున్నారని, మరింతమంది మెరుగైన స్పిన్నర్ల అవసరముందని అన్నాడు.  శ్రీలంకతో తొలి వన్డేలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement