దాదాకు దీదీ విషెస్ | Ganguly turns 44, wishes pour in | Sakshi
Sakshi News home page

దాదాకు దీదీ విషెస్

Jul 8 2016 1:18 PM | Updated on Oct 3 2018 7:14 PM

దాదాకు దీదీ విషెస్ - Sakshi

దాదాకు దీదీ విషెస్

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 45వ ఏట అడుగుపెట్టాడు. గంగూలీకి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 45వ ఏట అడుగుపెట్టాడు. శుక్రవారం దాదా జన్మదినం. గంగూలీకి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గంగూలీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకు దాదా రీ ట్వీట్ చేస్తూ దీదీకి కృతజ్ఞతలు చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కెప్టెన్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు దాదాకు శుభాకాంక్షలు తెలిపారు.

గంగూలీ తన కెరీర్లో 113 టెస్టులాడి 7213 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 311 మ్యాచ్లాడి 11,363 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్గా విదేశాల్లో 28 టెస్టుల్లో 11 మ్యాచ్లను గెలిపించాడు. భారత కెప్టెన్గా ఇది రికార్డు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement