‘టెస్టుల్లో అతడిపై నమ్మకం ఉంచండి’ | Former Cricketer Unhappy With Test Squad Without Rohit Sharma | Sakshi
Sakshi News home page

Oct 2 2018 12:11 PM | Updated on Oct 2 2018 3:22 PM

Former Cricketer Unhappy With Test Squad Without Rohit Sharma - Sakshi

సాక్షి, ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో రాణిస్తూ, అవసరమైనప్పుడు సారథ్య బాధ్యతలు వహించి టీమిండియా విజయాల్లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌ టీమిండియా గెలవడంలో రోహిత్‌ శర్మ ప్రధాన పాత్ర పోషించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎదురులేని రోహిత్‌.. టెస్టుల్లో మాత్రం అవకాశాలు లేక నిరాశే చెందుతున్నాడు. ప్రస్తుత ఫామ్‌, ఇంగ్లండ్‌లో కోహ్లి సేన ఘోర ఓటమి అనంతరం వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ సెలక్టర్లు ఆశ్చర్యకరంగా మరోసారి రోహిత్‌ను పక్కకు పెట్టేశారు. టెస్టులకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఇప్పటికే సౌరవ్‌ గంగూలీ, హర్బజన్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్‌ నిఖిల్‌ చోప్రా కూడా చేరారు. 

‘ టెస్టుల్లో విదేశీ పిచ్‌లపై ప్రస్తుతమున్న ఆటగాళ్లలో సారథి విరాట్‌ కోహ్లి తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రోహిత శర్మనే. కానీ సెలక్టర్లు అతడిపై ఎందుకు నమ్మకం ఉంచడంలేదు. గత ఐదు టెస్టు సిరీస్‌ల నుంచి అతడిని పక్కకు పెట్టారు. ఒకటి రెండు టెస్టుల్లో రోహిత్‌ విఫలమవ్వచ్చు. కానీ వరుస అవకాశాలు ఇస్తేనే రోహిత్‌ తానేంటో నిరూపించుకుంటాడు. పరిమిత క్రికెట్‌లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో కూడా సెలక్టర్లు అవకాశాలు ఇవ్వాలి.’ అంటూ నిఖిల్‌ చోప్రా తెలిపారు. (‘రోహిత్‌ లేకపోవడం ఆశ‍్చర్యానికి గురి చేసింది’)

విదేశాల్లో రోహిత్‌ శర్మ ప్రదర్శన చూస్తే 14 టెస్టుల్లో 58 సగటుతో 583 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్దసెంచరీలు ఉన్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న రెగ్యులర్‌ ఓపెనర్లు విజయ్‌, ధావన్‌లను పక్కకు పెట్టి కర్ణాటక ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌, ముంబై యువ సంచలనం పృథ్వీ షాలను ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో గాయాలతో ఇబ్బందులు పడిన బౌలర్లు ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌, జస్ప్రిత్‌ బుమ్రా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.   

చదవండి: సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో?: భజ్జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement