టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. బౌలర్ల వైఫల్యానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలవడంతో ప్రొటీస్ మూల్యం చెల్లించుకుంది.
230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఉఫ్‌మని ఊదేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ (16 బంతుల్లో 43; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఊచకోతతో ప్రారంభమైన పరుగుల వరద జో రూట్ (44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) జట్టు విజయాన్ని ఖాయం చేసేదాకా సాగింది. ఫలితంగా వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. బౌలర్ల వైఫల్యానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలవడంతో ప్రొటీస్ మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగుల స్కోరు సాధించింది.


