పాకిస్తాన్ నిషేధిత స్పిన్నర్ డానిష్ కనేరియా చెల్లించాల్సిన రెండున్నర కోట్ల రూపాయల జరిమానాను రాబట్టుకునేందుకు సహకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సింధు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
సింధు హైకోర్టును కోరిన ఈసీబీ
కరాచీ: పాకిస్తాన్ నిషేధిత స్పిన్నర్ డానిష్ కనేరియా చెల్లించాల్సిన రెండున్నర కోట్ల రూపాయల జరిమానాను రాబట్టుకునేందుకు సహకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సింధు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 2009లో ఎసెక్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో కనేరియా ఫిక్సింగ్, అవినీతికి పాల్పడ్డాడని ఈసీబీ విచారణ చేపట్టింది.
చివరకు 2012లో క్రమశిక్షణ కమిటీ అతనిపై లక్ష పౌండ్ల జరిమానా విధించింది. అయితే గతేడాది క్రికెటర్ దీనిపై రెండోసారి అప్పీల్‌కు వెళ్లి విఫలమయ్యాడు. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులను కూడా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఈసీబీ తరఫు లాయర్ ఖాజా నవీద్ వెల్లడించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కనేరియా చెప్పాడు.