‘దులీప్‌’ మ్యాచ్‌ మూడో రోజు వర్షార్పణం | 'Dulip' match is the third day stop rain | Sakshi
Sakshi News home page

‘దులీప్‌’ మ్యాచ్‌ మూడో రోజు వర్షార్పణం

Sep 16 2017 1:01 AM | Updated on Sep 19 2017 4:36 PM

ఇండియా ‘రెడ్, ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది

కాన్పూర్‌: ఇండియా ‘రెడ్, ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షం కారణంగా మూడో రోజు శుక్రవారం కేవలం 4.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

మైదానం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మిగతా ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 232 పరుగులు చేసిన బ్లూ మరో 151 పరుగులు వెనుకబడి ఉంది. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement