40 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ | Double century in 40 over match | Sakshi
Sakshi News home page

40 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ

Nov 26 2014 12:47 AM | Updated on Sep 2 2017 5:06 PM

వన్డేలో (50 ఓవర్ల మ్యాచ్) డబుల్ సెంచరీ కొడితే ఆశ్చర్యపోతాం. అలాంటిది 40 ఓవర్ల మ్యాచ్‌లోనే ఓ క్రికెటర్ డబుల్ సెంచరీబాదితే...

స్కూల్ క్రికెట్‌లో హైదరాబాద్ కుర్రాడి ఘనత

సాక్షి, హైదరాబాద్: వన్డేలో (50 ఓవర్ల మ్యాచ్) డబుల్ సెంచరీ కొడితే ఆశ్చర్యపోతాం. అలాంటిది 40 ఓవర్ల మ్యాచ్‌లోనే ఓ క్రికెటర్ డబుల్ సెంచరీబాదితే... కచ్చితంగా అది అద్భుతమే. హైదరాబాద్‌లోని ఓ స్కూల్ పిల్లాడు ఈ ఘనత సాధించాడు. బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నీలో... డీఆర్‌ఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేంద్రీయ విద్యాలయ (కేవీ) జట్టుకు చెందిన కృష్ణకాంత్ తివారి (200) అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు. కృష్ణకాంత్ జోరుతో కేవీ జట్టు 40 ఓవర్లలో 8 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత డీఆర్‌ఎస్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే ఆలౌటయింది. దీంతో కేవీ జట్టు 282 పరుగుల భారీతేడాతో గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement