
దినేష్ కార్తీక్
కొలంబొ: ఒకే ఒక్క మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్(డీకే) హీరో అయిపోయాడు. చివరి బంతికి అద్భుతం చేసి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అతడు బాదిన సిక్సర్ డీకే క్రీడా జీవితంలో పెద్ద మైలురాయిలా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి విజయాన్ని అందించిన క్రికెటర్ల జాబితాలో అతడి పేరు చేరిపోయింది.
గతంలో జావెద్ మియందాద్(పాకిస్థాన్), రియన్ మెక్‌లారెన్(దక్షిణాఫ్రికా), నాథన్ మెక్‌కల్లమ్(న్యూజిలాండ్), లాన్స్ క్లుసెనర్(దక్షిణాఫ్రికా), శివనారాయణ్ చంద్రపాల్(వెస్టిండీస్) అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్ని అందించిన ఘనత సాధించారు. ఇప్పుడు వీరి సరసన దినేష్ కార్తీక్ కూడా చేరాడు. జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన డీకేపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.