ఆసీస్‌ వన్డే కెప్టెన్‌గా ధోని..

Dhoni Named Captain Of Cricket Australia ODI Team - Sakshi

మెల్‌బోర్న్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా క్రికెట్‌  ఆస్ట్రేలియా(సీఏ) ధోనికి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆసీస్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేసింది. ఇక ధోనితో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు సైతం చోటు సీఏ తమ దశాబ్దపు వన్డే జట్టులో చోటు కల్పించింది.

కాగా, ఈ వన్డే జట్టులో ఒకే ఒక్క ఆసీస్‌ క్రికెటర్‌ను సీఏ తీసుకుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో మిచెల్‌ స్టార్క్‌కు మాత్రం క్రికెట్‌ ఆస్ట్రేలియా చోటు ఇచ్చింది. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లున్న సీఏ వన్డే జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీమ్‌ ఆమ్లా,  ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్‌ ఉండగా, ఇంగ్లండ్‌ నుంచి జోస్‌ బట్లర్‌కు చోటు కల్పించింది. న్యూజిలాండ్‌ నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌, అఫ్గానిస్తాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌లు న్నారు. శ్రీలంక నుంచి లసిత్‌ మలింగా చోటు  దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే. సీఏ ప్రకటించిన తమ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఎంపిక చేసింది. ఈ టెస్టు జట్టులో భారత్‌ నుంచి కోహ్లికి మాత్రమే  చోటు దక్కింది.

దశాబ్దపు సీఏ వన్డే జట్టు ఇదే..
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా

దశాబ్దపు సీఏ టెస్టు జట్టు ఇదే..
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌(వికెట్‌ కీపర్‌) బెన్‌ స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top