
ఓపెనర్ శిఖర్ ధావన్
భారత వన్డే జట్టు అద్భుతంగా రాణిస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలిగే సత్తా ప్రస్తుత కోహ్లి సేనలో ఉందని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో చాలా మంది అనుభవజ్ఞులున్నారు. సత్తాగల కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. పాండ్యాలాంటి ఆల్‌రౌండర్ జట్టుకు అదనపు బలం.
దీంతో దక్షిణాఫ్రికాల పేలవమైన రికార్డును చెరిపేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది’ అని ధావన్ అన్నాడు. ఫ్లాట్ పిచ్‌లపై కూడా చెలరేగే మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను ఎదుర్కోవడం ఇప్పుడు ఏ జట్టుకైనా కష్టమేనన్నాడు.