
బులవాయో: లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (5/79) ధాటికి జింబాబ్వే జట్టు విలవిల్లాడింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. మసకద్జా (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ఎర్విన్ (39; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (38 బ్యాటింగ్), హోప్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 148 పరుగుల ఆధిక్యంలో ఉంది.