జహీర్ ఖాన్ లేడు | Delhi Daredevils won the toss and elected to field | Sakshi
Sakshi News home page

జహీర్ ఖాన్ లేడు

May 12 2016 7:52 PM | Updated on Sep 3 2017 11:57 PM

జహీర్ ఖాన్ లేడు

జహీర్ ఖాన్ లేడు

ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ జరుగుతున్న 42వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి.

హైదరాబాద్: ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ జరుగుతున్న 42వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి టీమ్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఢిల్లీ జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. జహీర్ ఖాన్, బ్రాత్ వైట్, బిల్లింగ్స్, నదీం స్థానంలో డుమిని, కౌల్టర్-నిల్, జయంత్ యాదవ్, మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చారు. హైదరాబాద్ టీమ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement