ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌

Daniel Vettoris Jersey Number 11 Retired - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియెల్‌ వెటోరి గౌరవార్థం అతను ధరించిన జెర్సీ నంబర్‌-11కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.  ఈ మేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ఓ  ప్రకటనలో స్పష్టం చేసింది. డానియల్‌ వెటోరి జెర్సీ నంబర్‌ 11తో రెండొందలకు పైగా వన్డేలు ఆడటంతో ఇకపై ఆ జెర్సీ నంబర్‌ను ఎవ్వరికీ కేటాయించమని పేర్కొంది. ‘ ఎవరైతే కనీసం రెండొందల వన్డేలు ఒకే జెర్సీ నంబర్‌తో ఆడతారో ఆ జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నాం. జెర్సీ నంబర్‌-11తో వెటోరి 291 వన్డేలు ఆడాడు. దాంతో ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాం’ అని కివీస్‌ బోర్డు పేర్కొంది. మరొకవైపు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ల నేపథ్యంలో ఆటగాళ్ల నంబర్లను న్యూజిలాండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

విలియమ్సన్‌ -22
ఆస్టలే-60
బ్లండెల్‌-66
బౌల్ట్‌-18
గ్రాండ్‌హోమ్‌-77
లాథమ్‌-48
నికోలస్‌-86
పటేల్‌-24
రావల్‌-1
సోమర్‌విల్లే-28
సాంత్నార్‌-74
సౌథి-38
టేలర్‌-3
వాగ్నర్‌-35
వాట్లింగ్‌-47

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top