సిరిల్‌ శుభారంభం | Cyril started | Sakshi
Sakshi News home page

సిరిల్‌ శుభారంభం

Jun 28 2017 12:08 AM | Updated on Sep 5 2017 2:36 PM

చైనీస్‌ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మిం టన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ శుభారంభం చేశాడు.

 సౌరభ్‌ వర్మకు షాక్‌
న్యూఢిల్లీ: చైనీస్‌ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మిం టన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ శుభారంభం చేశాడు. మం గళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సిరిల్‌ 21–11, 10–21, 21–19తో వీ చి లియు (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు. భారత ఆటగాళ్లు అభిషేక్, హర్షీల్‌ డాని కూడా తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ (భారత్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. నాలుగో సీడ్‌ సౌరభ్‌ 19–21, 20–22తో లీ జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రాహుల్‌ యాదవ్‌ తన ప్రత్యర్థి ఎన్‌ చియా చింగ్‌ (చైనీస్‌ తైపీ)కు ‘వాకోవర్‌’ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement