నన్ను రిలీవ్‌ చేయండి: మహిళా క్రికెటర్‌

Cricketer Harmanpreet Kaur wants Railway to relieve her - Sakshi

చండీగఢ్‌:గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కొత్త ఉద‍్యోగం కష్టాలు తప‍్పడం లేదు. ఆ ప్రపంచ కప్‌ తర్వాత పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగ హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటికీ ఆమె కొత్త ఉద్యోగంలో చేరలేకపోయింది. అందుకు కారణం తన పాత ఉద్యోగం చేస్తున్న వెస్ట్రన్‌ రైల్వే నుంచి ఇంకా రిలీవ్‌ లెటర్‌ రాకపోవడమే.

మూడు సంవత్సరాల క్రితం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ వెస్ట్రన్‌ రైల్వేలో ఆఫీస్‌ సూపరిండెంట్‌ ఉద్యోగిగా చేరింది. ఆ సందర్భంగా ఐదేళ్ల బాండ్‌పై సంతకం చేసింది. మూడేళ్లు మాత్రమే పూర్తవ్వడంతో హర్మన్‌కు రైల్వే అధికారులు రిలీవింగ్‌ లెటర్‌ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె తనకు రిలీవ్‌ చేయాలంటూ మరోసారి విజ్ఞప్తి చేసింది. అప‍్పుడే డీఎస్పీ గా ఉద్యోగం చేయడానికి వీలువుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై  పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఆమె డీఎస్పీ ఉద్యోగంలో చేరుతుందని అమరీందర్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top