లాక్‌డౌన్‌: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?

Corona Lockdown: Anushka Sharma Gives A Haircut To Kohli - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు పకడ్బంది చర్యలు చేపట్టిన. అయితే కరోనా ముప్పు గురించి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కొంతమంది లాక్‌డౌన్‌ను సక్రమంగా పాటించడం లేదు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఎలా ఆస్వాదించవచ్చో వివరిస్తూ సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో కలసి లాక్‌డౌన్‌ సమయాన్ని ఆరోగ్యకరంగా ఎలా ఎంజాయ్‌ చేయాలో తెలుపుతూ విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మలు సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతున్నారు. 

తాజాగా విరాట్‌ కోహ్లికి అనుష్క శర్మ హెయిర్‌ కట్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది ఈ జంట. ‘క్వారంటైన్‌లో ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నించండి. వంటింటి కత్తెరతో హెయిర్‌ కట్‌ చేసుకోవచ్చు అని ఈ రోజు తెలిసింది. ఇక  నా సతీమణి నాకు హెయిర్‌ కట్‌ అద్భుతంగా చేసింది’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అత్యవసర సమయాల్లో మినహా లాక్‌డౌన్ పాటించని ప్రజలపై విరుష్కలు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతూ వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top