క్రికెట్‌ ‘బాహుబలి’ ఫన్నీ రనౌట్‌

Cornwall Run Out Leaves CPL Commentators Gobsmacked - Sakshi

సెయింట్‌ లూసియా:  ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బరువున్న ఆటగాడిగా వెస్టిండీస్‌ ఆటగాడు రకీమ్‌ కార్న్‌వాల్‌ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌తో  జరిగిన రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రకీమ్‌ ఆరు అడుగులకు పైగా ఉండగా, 140 కేజీలకు పైగా బరువు ఉన్నాడు. దాంతో అత్యంత బరువు కల్గిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.  ఇప్పటివరకూ ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని కార్న్‌వాల్‌ బ్రేక్‌ చేశాడు. ఇదిలా ఉంచితే, కరీబియర్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో కార్న్‌వాల్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

అంత బరువు ఉ‍న్న ఆటగాడు పరుగు పెట్టడమే కష్టం అనే విమర్శకుల నోటికి పని చెప్పాడు. సెయింట్‌ లూసియా జౌక్స్‌ తరఫున ఆడుతున్న కార్న్‌వాల్‌.. గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్‌  అయ్యాడు. సాధారణంగా  పరుగు కోసం యత్నించే సమయంలో క్రీజ్‌లోకి రాకపోతే సదరు బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అవుతాడు. మరీ భారీ కాయుడు కార్న్‌వాల్‌ మాత్రం క్రీజ్‌లోకి వచ్చినా వంగలేక బ్యాట్‌ను పెట్టలేకపోయాడు. దాంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. కేవలం 12 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన కార్న్‌వాల్‌.. సింగిల్‌ తీసే క్రమంలో పెవిలియన్‌ చేరాడు. అది ఈజీ సింగిల్‌ అయినప్పటికీ కార్న్‌వాల్‌ క్రీజ్‌లోకి చేరినా బ్యాట్‌ను గాల్లోనే ఉంచాడు. దాంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top