మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్ శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఆదివారం భారత్ మరో పతకం సాధించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్ శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది.
శ్రేయాషి సింగ్ 92 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో ఇంగ్లండ్ షూటర్ కెర్వూడ్ 94 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం దక్కించుకోగా, కెనడా షూటర్ మేయర్ 91 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది.