10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్ | Close to 10 billion dollars jocovich and Federer | Sakshi
Sakshi News home page

10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్

Dec 27 2015 1:28 AM | Updated on Sep 3 2017 2:37 PM

10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్

10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్

టెన్నిస్ టాప్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాన్ జొకోవిచ్ 10 కోట్ల డాలర్ల (రూ.660 కోట్లు) ప్రైజ్‌మనీ క్లబ్‌లో చేరనున్నారు.

టెన్నిస్ టాప్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాన్ జొకోవిచ్ 10 కోట్ల డాలర్ల (రూ.660 కోట్లు) ప్రైజ్‌మనీ క్లబ్‌లో చేరనున్నారు. 34 ఏళ్ల ఫెడరర్ వివిధ టోర్నీల ద్వారా ఇప్పటివరకూ 97.3 మిలియన్ డాలర్లు (రూ.643 కోట్లు) ప్రైజ్‌మనీ అందుకోగా... 28 ఏళ్ల జొకోవిచ్ 94 మిలియన్ డాలర్లు (రూ.621 కోట్లు) సాధించాడు. ఇప్పటివరకూ టెన్నిస్ చరిత్రలో ఎవరూ 10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీని సంపాదించలేదు. 2016లో ఫెడరర్, జొకోవిచ్‌లలో ఒకరు ముందుగా ఈ మార్కును చేరుకుని చరిత్ర సృష్టించబోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement