మూడో రౌండ్‌లో బ్రెజిల్ ప్లేయర్ ఫొన్సెకా చేతిలో పరాజయం
పారిస్: కెరీర్‌లో రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సెర్బియా దిగ్గజం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్‌లోనే అనూహ్య ఓటమి ఎదురైంది.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జొకోవిచ్ 6–4, 6–4, 3–6, 5–7, 5–7తో ప్రపంచ 30వ ర్యాంకర్ జోవో ఫొన్సెకా (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తొలి రెండు సెట్‌లు గెలిచి విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ పట్టువదలని ఫొన్సెకా అద్భుత ఆటతీరుతో వరుసగా మూడు సెట్‌లు గెలిచి తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
కెరీర్‌లో 21వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జొకోవిచ్ 3వ రౌండ్‌లోపు ని్రష్కమించడం ఇది మూడోసారి మాత్రమే. 2009లో మూడో రౌండ్‌లో ఓడిన ఈ సెర్బియా దిగ్గజం... 2005లో 2వ రౌండ్‌లో నిష్క్రమించాడు. ఫొన్సెకాతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 8 ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్‌లో 78 పాయింట్లు, రెండో సరీ్వస్‌లో 25 పాయింట్లు స్కోరు చేశాడు. తన సరీ్వస్‌ను ఆరుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
70 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. తాజా ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ గాయంతో దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించడంతో... మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్‌కు నాలుగోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని జొకోవిచ్ సది్వనియోగం చేసుకోలేకపోయాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 2–6, 2–6, 3–6తో జేకబ్ మెన్‌సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.
స్వియాటెక్ ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగుసార్లు చాంపియన్, మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
మూడో రౌండ్‌లో స్వియాటెక్ 6–4, 6–4తో మగ్దా లినెట్టి (పోలాండ్)పై, స్వితోలినా 6–2, 6–3తో తమరా కొర్‌పాత్చ్ (జర్మనీ)పై, ఆండ్రీవా 6–4, 6–2తో మేరీ బుజ్‌కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 3–6, 4–6తో సిమోన్ బొలెలీ–వవాసోరి (ఇటలీ) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) జంట 7–5, 6–2తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్‌నెర్ (జర్మనీ) జోడీపై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.


