పెగూలా, రిబాకినా అవుట్‌ | French Open Grand Slam Tennis Tournament Women's Singles | Sakshi
Sakshi News home page

పెగూలా, రిబాకినా అవుట్‌

May 28 2026 10:07 AM | Updated on May 28 2026 12:21 PM

French Open Grand Slam Tennis Tournament Women's Singles

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) రెండో రౌండ్‌లో నిష్క్రమించగా... ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలిచిన రిబాకినా రెండో రౌండ్‌లో 6–3, 1–6, 6–7 (4/10)తో ప్రపంచ 55వ ర్యాంకర్‌ యూలియా స్టారోడట్‌సెవా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిబాకినా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. కేవలం 23 విన్నర్స్‌ కొట్టిన ఈ కజకిస్తాన్‌ స్టార్‌ ఏకంగా 71 అనవసర తప్పిదాలు చేసింది.

మరోవైపు ప్రపంచ 83వ ర్యాంకర్‌ కింబర్లీ బిరెల్‌ (ఆ్రస్టేలియా) 1–6, 6–3, 6–3తో ఐదో సీడ్‌ జెస్సికా పెగూలాను బోల్తా కొట్టించింది. మరోవైపు నాలుగుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, మూడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), ఏడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), 11వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌), 15వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో స్వియాటెక్‌ 6–2, 6–3తో సారా బెజ్లెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై, స్వితోలినా 6–0, 6–4తో కైట్లిన్‌ క్యూవెడో (స్పెయిన్‌)పై, బెన్‌చిచ్‌ 6–4, 6–0తో కేటీ మెక్‌నాలీ (అమెరికా)పై, కొస్టుక్‌ 6–7 (4/7), 6–3, 6–3తో కేటీ వొలీనెట్స్‌ (అమెరికా)పై గెలుపొందారు.

జొకోవిచ్‌ ముందంజ..
పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–2, 6–7 (7/9), 6–3తో వాలెంటిన్‌ రొయెర్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. సినెర్‌ 6–1, 6–3, 6–4తో క్లెమెంట్‌ టబుర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 13వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) 7–6 (7/5), 5–7, 6–1, 7–6 (7/4)తో మార్కో ట్రున్‌గెలిటి (అర్జెంటీనా)పై, 11వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–1, 1–6, 6–3, 7–6 (7/5)తో కారాబెల్లి (అర్జెంటీనా)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement