ఐపీఎల్లో క్రిస్ లిన్ ఆడతాడు | Chris Lynn could still play IPL 10, Umesh Yadav joins trainning | Sakshi
Sakshi News home page

ఐపీఎల్లో క్రిస్ లిన్ ఆడతాడు

Apr 11 2017 7:23 PM | Updated on Sep 5 2017 8:32 AM

ఐపీఎల్లో క్రిస్ లిన్ ఆడతాడు

ఐపీఎల్లో క్రిస్ లిన్ ఆడతాడు

ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోల్ కతా నైట్ రైడర్స్ క్రిస్ లిన్ టోర్నీ దూరం కావడం లేదని ఆ జట్టు యాజమాన్యం స్సష్టం చేసింది.

ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోల్ కతా నైట్ రైడర్స్ క్రిస్ లిన్ టోర్నీ దూరం కావడం లేదని ఆ జట్టు యాజమాన్యం స్సష్టం చేసింది. ఈ మేరకు గాయపడ్డ లిన్ స్వదేశానికి పయనమైతున్నట్లు వచ్చిన వార్తలను కేకేఆర్ ఖండించింది.

 

' ఐపీఎల్-10 లో లిన్ మాతోపాటే ఉంటాడు. అతనికి గాయమైన మాట వాస్తవమే. పాత గాయంపైనే మరొకసారి గాయం కావడంతో ఆ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కేకేఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో లిన్ కు ట్రీట్మెంట్ కు జరుగుతుంది. అతని గాయంతో ఇబ్బంది లేదు. ఐపీఎల్లో లిన్ ఆడతాడు' అని కేకేఆర్ సహ యజమాని వెంకీ మైసూర్ తెలిపారు.

 

మొన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో లిన్ చెలరేగి ఆడి 41 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 93 పరుగులు చేసి కోల్ కతా ఘన విజయంలో పాలు పంచుకున్నాడు. ఆ తరువాత  ముంబైతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు.  అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టడంతో లిన్ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో జాస్ బట్లర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో లిన్ ఎడమ భుజానికి గాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement