భారత మహిళల హాకీ చీఫ్ కోచ్‌గా మరిన్
భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా జోర్డ్ మరిన్‌ను నియమించారు.
భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా జోర్డ్ మరిన్‌ను నియమించారు. నెదర్లాండ్స్ మహిళా జట్టు మాజీ కోచ్ అయిన మరిన్ నాలుగేళ్ల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారని హాకీ ఇండియా (హెచ్‌ఐ) వెల్లడించింది. నెదర్లాండ్స్‌కే చెందిన ఆయన సహచరుడు ఎరిక్ వోనింక్ విశ్లేషక కోచ్‌గా నియమించినట్లు హెచ్‌ఐ కార్య దర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
మరిన్ శిక్షణలోనే నెదర్లాండ్స్ అండర్–21 మహిళల జట్టు ప్రపంచకప్ టైటిల్ గెలువగా... సీనియర్ జట్టు హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ (2015)లో బంగారు పతకం నెగ్గింది.


