
టెస్టు కెరీర్ బెస్టు ర్యాంక్ లో రహానే
భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ ర్యాంకుల్లో కిందకు జారారు.
దుబాయ్: భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ ర్యాంకుల్లో కిందకు జారారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో పూజారా రెండు స్థానాలు పడిపోయి పదో ర్యాంక్ లో నిలిచాడు. భారత్ తరపున అతడితే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. కోహ్లి 14 నుంచి 15 ర్యాంక్ కు వచ్చాడు. సౌంప్టన్ టెస్టులో భారత్ 266 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం టీమిండియా ఆటగాళ్ల ర్యాంకులపై ప్రభావం చూపింది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడంతో పాటు సౌంప్టన్ టెస్టులోనూ అర్థసెంచరీలు కొట్టిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్య రహానే తన కెరీర్ బెస్టు ర్యాంక్ సాధించాడు. 9 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్ లో నిలిచాడు. ఇక బౌలర్లలో రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. జడేజా 25, భువనేశ్వర్ కుమార్ 32వ ర్యాంక్ దక్కించుకున్నారు.