కొందరు నమ్మరు.. మరికొందరు నవ్వుతారు: గంగూలీ | Cheteshwar Pujara should be Indias number four in ODIs,Ganguly | Sakshi
Sakshi News home page

కొందరు నమ్మరు.. మరికొందరు నవ్వుతారు: గంగూలీ

Mar 16 2019 10:48 AM | Updated on May 29 2019 2:38 PM

Cheteshwar Pujara should be Indias number four in ODIs,Ganguly - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టులో నాలుగో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ తర్వాత నాల్గో స్థానం అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సిరీస్‌లో అంబటి రాయుడు విఫలమైతే, విజయ్‌ శంకర్‌ కాస్త ఆశలు రేపాడు. రిషభ్‌ పంత్‌ను సైతం ప్రయోగించినా మంచి ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ స్థానంపై ఎవ్వరిపైనా 100 శాతం నమ్మకం కుదరలేదు. దీంతో మళ్లీ ‘నంబర్‌ 4’పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్‌ పుజారా పేరును భారత మాజీ కెప్టెన్‌ గంగూలీ తెరపైకి తీసుకొచ్చాడు. కేవలం టెస్టు ఆటగాడిగా ముద్రపడిన పుజారాను వన్డేల్లో నాల్గో స్థానంలో ఆడించాలంటూ అందరినీ ఆశ‍్చర్యంలో ముంచెత్తాడు.

‘నేను చెప్పేది విని చాలా మంది నమ్మరు. కొందరు నా సూచన విని నవ్వుతారు. నా వరకైతే  వన్డేల్లో ‘నంబర్‌ 4’కు చతేశ్వర్‌ పుజారా సరిపోతాడు. ఫీల్డింగ్‌లో అతడు మరీ చురుకు కాదని తెలుసు.. కానీ మంచి బ్యాట్స్‌మన్‌. నా ప్రతిపాదన విని షాక్‌ అవుతారని తెలుసు. కానీ టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు వన్డే క్రికెట్‌లో పటిష్ఠత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా వరకూ అయితే వన్డే ఫార్మాట్‌లో నాల్గో స్థానంలో పుజారానే మంచి చాయిస్‌’ అని గంగూలీ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement