20 నుంచి చెస్ టోర్నీ | chess tourny starts from 20th december | Sakshi
Sakshi News home page

20 నుంచి చెస్ టోర్నీ

Dec 3 2016 10:50 AM | Updated on Sep 4 2017 9:49 PM

సీజర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: సీజర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. నాగోల్‌లోని ధర్మారెడ్డి గార్డెన్‌‌సలో 25వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు.

 

ఈ కార్యక్రమంలో టీఎస్‌జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీజర్ అకాడమీ డెరైక్టర్ విశ్వనాథ్, తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి ఆనం వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement